ఇజ్రాయిల్‌లో నర్సింగ్‌ ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

ఇజ్రాయిల్‌లో నర్సింగ్‌ ఉద్యోగాలు

Jul 19 2026 2:20 AM | Updated on Jul 19 2026 2:20 AM

ఇజ్రాయిల్‌లో నర్సింగ్‌ ఉద్యోగాలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఇజ్రాయిల్‌లో ఒప్పంద ప్రాతిపదికన నర్సింగ్‌ సెక్టార్‌–6ఎలో పనిచేసేందుకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తు లు కోరుతున్నట్లు జిల్లా ఎస్సీ కులాల సేవా సహకా ర సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) కె.వినాయకం శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి, 25 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 1,99,700 చొప్పు న వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నర్సింగ్‌ స్కిల్స్‌తో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు మొబైల్‌ నంబరు 97048 95271లో సంప్రదించాలని ఈడీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement