సీదిరిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా నీచ రాజకీయాలు చేస్తున్నారు. యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిన దుర్ఘటన.. దీన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడడం హేయమైన చర్య. పలాసలో గౌతు శిరీష చేస్తున్న అక్రమాలపై సీదిరి పోరాడుతుండడంతో ఇలా కుట్రలు పన్నుతున్నారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడం మంచిదే.. మరి అన్ని రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ఇలాగే పరిహారం ఇస్తారా..? ఎరువుల కోసం వెళ్లి ఓ మహిళ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. గతంలో పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారుతో ఢీకొట్టిన ఘట నలో ఓ వ్యక్తి చనిపోతే హత్య కేసుగా ఎందుకు నమోదు చేయలేదు.
– నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సత్తారు సత్యం (టెక్కలిలో విలేకరుల సమావేశంలో..)


