కొత్తూరు: కొత్తూరు మండలం మాకవరం గ్రామానికి చెందిన వాడివలస చంద్రరావుకు చెందిన గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను స్థానిక తహసీల్దార్ పి.సరోజిని, ఏఓ సుమంత్‌లు శుక్రవారం సీజ్‌చేశారు. మాకవరం గ్రామంలో వాడివలస చంద్రరరావు, కోట్ని రామారావులకు చెందిన గోదాముల్లో యూరియా, డీఏపీతో పాటు పలు రకాల ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో అధికారులు మాకవరం చేరుకుని రెండు గోదాముల్లో తనిఖీలు చేశారు. 20 ః 20 ః 13, కాంప్లెక్స్ ఎరువు బస్తాలు 60, సింగిల్ సూపర్‌పాస్పేట్ 20 బస్తాలు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించినట్లు తహసీల్దార్, ఏఓ తెలిపారు. రెండు గోదాములను సీజ్ చేశామన్నారు. ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిపై 6 కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. యూరియాను అధికారులు వెళ్లే సరికి పక్క రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం.
మాకవరం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులను పరిశీలిస్తున్న తహసీల్దార్ సరోజిని, ఏఓ సుమంత్


