ఆమదాలవలస రూరల్: వాయుగుండం ప్రభావంతో వందలాది ఎకరాల పంట పొలాల్లో బురద పేరుకుపోయింది. ముఖ్యంగా బూర్జ మండలం అల్లెన వద్ద నాగావళి నది వరద నీరు గట్టెక్కటంతో మండలంలో చీమలవలస, కొరపాం, జి.కె.వలస, కొత్తవలస, కోర్లకోట, తొగరాం, కలివరం తదితర గ్రామాలకు సంబంధించి పంట పొలాలు వరద నీటిలో మునిగి తేలటమే కాకుండా వదర నీరు బురద పట్టి పంట పోయింది. కానీ వ్యవసాయాధికారులు మాత్రం వారం పాటు అన్నీ పరిశీలించి నష్టం ఉండదని తేల్చేశారు. ఇది రైతులకు మింగు డు పడడం లేదు. కరువుకు సంబంధించి మండలం యూనిట్‌గా తీసుకోవటంతో ఆమదాలవలస రూర ల్ మండలంతో పాటు ఆమదాలవలస మున్సిపాలిటీలో పలు గ్రామాలకు సంబంధించిన పంట పొలా లు వర్షాధారంపైనే ఉండటంతో కరువు నష్టం ఎన్నడూ అందని పరిస్థితి నెలకొంది. అయితే కాలువలపై సాగుచేసే భూములకు నిత్యం వరద ప్రమాదం తప్పటం లేదు. అయితే ప్రభు త్వం కనీసం నష్టపరిహారం అందించకుండా చేతులెత్తేయటం అన్నదాతలను సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో కూటమి పాలకులు, పాలనాధికారులు పర్యవేక్షణ చేసి పంట నష్టం గుర్తించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.
ఆదేశాలే లేవు..
వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల కు సంబంధించి నష్టం గుర్తించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో పంట నష్టం గుర్తించే అవకాశం లేదు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్పకుండా పంట నష్టం గుర్తిస్తాం.
– మెట్ట మోహనరావు,
మండల వ్యవసాయశాఖాధికారి, ఆమదాలవలస
రైతులను ఆదుకోవాలి
వరదల కారణంగా ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా ముంపునకు గురైనా యి. దీంతో చాలా మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం తక్షణమే అన్నదాతలను ఆదుకోవాలి.
– చింతాడ రవికుమార్, వైఎస్సార్‌సీపీ
నియోజకవర్గ సమన్వయకర్త
నష్టాన్ని గుర్తించాలి
వరదల వల్ల అనేక ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం పంట నష్టం గుర్తించటంలో చేతులేత్తేయటం సరికాదు. వరితో పాటు మొక్కజొన్న తదితర పంటలు వరద ప్రభావానికి గురయ్యాయి. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన నాయకులు రైతుకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. – బొడ్డేపల్లి కృష్ణారావు, రైతు, ఇసుకలపేట, ఆమదాలవలస రూరల్ మండలం
వరద, బురదలో ధ్వంసమైన వరి పొలాలు
పంట నష్టం లేదని అధికారుల మాటలు
ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు


