ఈ శోకానికి కారణమెవరు.? | - | Sakshi
Sakshi News home page

ఈ శోకానికి కారణమెవరు.?

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

ఈ శోకానికి కారణమెవరు.?

● విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

● పొలంలో పడి ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో ప్రాణాలు కోల్పోయిన వైనం

పోలాకి:

మండలంలోని దీర్ఘాశి గ్రామంలో విద్యు త్‌ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన మెండ హేమసుందర్‌(24) దివిస్‌ కంపెనీలో పనిచేస్తూ వీకెండ్‌ కావటంతో ఇంటికి వచ్చాడు. సరదాగా గ్రామంలోని పంట పొలాలు చూసేందుకు ఆదివారం సాయంత్రం వేళ వెళ్లిన కొడుకు చీకటి పడుతున్నా ఇంటికి రాకపోవటంతో అటుగా వెళ్లినట్లు చూసిన స్థానికులు పొలం వైపునకు వెళ్లగా అక్కడ హేమసుందర్‌ విగతజీవిగా పడి ఉన్నాడు. అక్కడే తెగి పడి ఉన్న విద్యుత్‌ లైన్‌ను స్థానికులు గుర్తించి ట్రాన్స్‌కో సిబ్బందికి సమాచా రం ఇచ్చారు. గ్రామంలో గతంలో ఒక రైతు కూడా ఇదే విధంగా విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. మరోసారి ఎలుగుబంటి సైతం తెగిన విద్యుత్‌ లైన్‌కు బలైంది. వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ తీగలను నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలాకి ఎస్‌ఐ రంజిత్‌ కేసునమోదు చేసి, మృతదేహాన్ని నరసన్నపేట పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతి చెందిన

హేమసుందర్‌ (పైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement