శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మహిళల సీనియర్స్ ఫుట్‌బాల్ జట్టు ఖరారైంది. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ఆద్యంతం హోరాహోరిగా సాగాయి. ఇక్కడ ఎంపికచేసిన జిల్లా జట్టును ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్‌జిల్లాల) సీనియర్స్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు పంపించనున్నట్టు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
జిల్లా జట్టు వివరాలు
టి.రోహిణి, ఎన్.అమృత, కె.నీరజ, సీహెచ్ దేవిశ్రీ, ఎం.ఝాన్సీ, బి.హారిక, ఏ.కుసుమ, పి.సంగీత ఎం.ప్రసన్న, కే.మనీషా, ఎన్.లలిత, ఎస్‌వైడి.మహిమ, వి.గ్రేసీ, ఎస్.పావని, జె.మమత, సిహెచ్.మౌనిక, కే.పవిత్ర. స్టాండ్ బైగా డి.విజయలక్ష్మి, పి.హిందూ, సిహెచ్. దివ్య, వి.రమ్య పి.దీపిక ఎస్ .తనుశ్రీ సిహెచ్ యమున ఎంపికై న వారిలో ఉన్నారు.


