కొనసాగుతున్న ఎదురుచూపులు
శ్రీకాకుళం పాతబస్టాండ్:రెండున్నరేళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తే కూటమి ప్రభుత్వం ఇప్పటికి కరుణించింది. మంజూరు సంగతి దేవుడెరుగు.. పింఛన్ల కోసం కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క వృద్ధునికి గానీ, దివ్యాంగునికి గానీ, ఇతర కేటగిరీల వారికెవ్వరికీ కొత్త పింఛన్ అన్నదే ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇస్తామని దరఖాస్తులు ఆహ్వానించా రు. కానీ విధానంలో లోపాలు, అతి తక్కువ సమ యం ఇవ్వడం వల్ల దాదాపు సగం మంది అర్హులు కూడా పింఛన్లకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. పైగా దాదాపు సగం మందివి పలు కారణాలతో రిజెక్టు చేశారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లకు 59,051 దరఖాస్తులు రాగా, వీటిలో సగం అంటే 31,292 మాత్రమే అనుమతులు పొందాయి. పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేదా తెలుపురంగు రేషన్ కార్డు, వితంతువులకు మరణ ధ్రు వీకరణ పత్రం, ఒంటరి మహిళా పత్రం, సద రం ధ్రువీకరణ పత్రం, మెడికల్ ధ్రువీకరణ పత్రా లు వంటివి అవసరం. వీటిని సమకూర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆ సమ యం కూడా ఇవ్వకుండా ఆదరాబాదరాగా దరఖాస్తుల స్వీకరణ కానిచ్చేశారు. దీంతో చాలా మంది అర్హులై న వారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు లేకుండా పోయింది.
మ్యాపింగ్ కాలేదు
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సవరణకు అవకాశం కల్పించలే దు. దీంతో ఈ మూడేళ్లలో ఉద్యోగం పొందిన వారి కుటుంబాలు, ఇన్‌కంటాక్సు, నాలుగు చక్రల వాహనాలు ఉండే వారు హౌస్ హోల్డ్ జాబితాల్లో కొంతమంది పింఛనుకు అర్హులైన వారి పేర్లు ఉండిపోయాయి. వాటిని విడదీయాలి. అయితే పింఛన్ భారాన్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఆ విభజనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వేలాదిమంది ఈ సారి పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
ఒక కుటుంబంలో ఒక వితంతువు, ఒక దివ్యాంగుడు ఉంటే వారిలో ఒక్కరికే పింఛను వస్తుందని, వీరిలో ఎవరికి పింఛన్ కావాలో వారే దరఖాస్తు చేయాలని స్థానిక నాయకులు పింఛను ఆశావహులకు చెబుతున్నారు. పింఛన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైన నాటి నుంచి కూటమి నాయకులు పంచాయతీ పైరవీలు ప్రారంభించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా విజ యం కోసం పింఛను అడ్డం పెట్టుకొని చాలా మంది గ్రామ స్థాయి నాయకులు పైరవీలు చేస్తున్నారని తెలుస్తోంది. అనుకున్న సమయానికి ఈ పింఛన్లు ఇస్తారని ప్రజల్లో నమ్మకం లేదు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కొత్త పింఛన్ల కోసం ఇంత ప్రయాస పడలేదు. ఇంటింటా సర్వే జరిపించి, వలంటీర్లు ఇంటికి వెళ్లి వివరాలు తీసుకొని, సకాలంలో అర్హులకు పింఛన్లు ఇప్పించారు. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా అర్హతే ప్రధానంగా అన్ని రకాల పింఛన్లు అందజేశారు. పింఛన్ల సంఖ్యను కావాలని తగ్గించడం, ఒకే పింఛన్ విధానం అన్నవేవీ లేవు.
జిల్లాలో కొత్త పింఛన్ల కోసం
అనుమతి పొందినవి సగం మాత్రమే
సమయాభావంతో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు
పింఛన్ల మంజూరుపై వీడని మీమాంస


