మడపాం టోల్‌గేట్ వద్ద రోడ్డుకు ఆనుకొని ఉన్న షాపులను, షాపుల ముందు నిర్మాణాలను ఎన్‌హెచ్ అధికారులు తొలగించడంతో పలు కు టుంబాలు వీధిన పడ్డాయి. బతుకు తెరువు కోసం చిన్నా, పెద్దా దుకాణాలు, హోటల్స్ పెట్టుకొని 200లకు పైగా కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. అయితే వీరంతా రోడ్డు స్థలాలను ఆక్రమించి బడ్డీలు పెట్టుకున్నారని మూడు రోజులుగా నిర్మాణాలు తొలగిస్తున్నారు. గతంలో రోడ్డు విస్తరణకు తమ స్థలాలు ఇచ్చామని, మిగిలిన స్థలాల్లో షాపులు నిర్మించి తోవ కోసం రోడ్డు పక్క స్థలాలను వినియోగిస్తున్నామని బాధి తులు అంటున్నారు. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రిని కూడా సంప్రదించినట్లు తెలిపారు. – నరసన్నపేట


