శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు’లలో భాగమైన ‘కౌశలం’ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యో గ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 6న ఉదయం 9 గంటల నుంచి ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రముఖ ప్రీమియర్ ఎనర్జీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు హాజరై అప్రెంటిసిస్ కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని, వార్షిక వేతనం రూ.1,64,806 నుంచి రూ. 4,00,000 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన డిప్లమా కోర్సులు మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఐటీఐ ట్రేడ్స్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ , మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, డీజిల్ మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్ ట్రేడ్లు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఎలాంటి పూర్వ అనుభవం లేని వారు కూడా నియామక ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు తిరుపతి సమీపంలోని సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది. వేతనంతో పాటు లోకల్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం కల్పిస్తారని వెల్లడించారు.
స్కూల్ గేమ్స్ అండర్–19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
నరసన్నపేట: స్కూల్ గేమ్స్‌లో భాగంగా రాష్ట్ర స్థాయిలో పాల్గొననున్న అండర్–19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు వేర్వేరుగా 16 మంది చొప్పున 32 మందిని ఎంపిక చేశారు. స్థానిక పీఎం శ్రీ స్కూల్ ఆవరణలో ఆదివారం ఎంపికలు నిర్వహించారు. ఈ నెల 10 నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలో పెద్దవేగిలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్‌చార్జి హెచ్‌ఎం సాయి శ్రీనివాస్, జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ అసోషియేషన్ ప్రతినిధిలు ఎం. తిరుపతిరావు, సత్యనా రాయణ, ఆనంద్ కిరణ్, రాజగోపాల్, రామరా జు, మధు చిన్ని కృష్ణ, గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
పాము కాటుకు ఆవు మృతి
ఎల్.ఎన్.పేట: ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన ముగడ వెంకటరమణకు చెందిన ఆవు పా ము కాటుకు గురై మృతి చెందింది. ఆదివారం సాయంత్రం బసరాజుపేట గ్రామానికి వెళ్లే రహదారి వద్ద ఆవు మేత మేస్తుండగా పాము కాటు వేసినట్లు పాడి రైతు వెంకటరమణ తెలిపారు. ఆవు విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గెడ్డలో చేపల మృత్యువాత
రణస్థలం: మండలంలోని నారువ, మెంటాడ పంచాయతీల పరిధిలోని అక్కయ్యపాలెం దగ్గరలో కందివలస గెడ్డలో చేపలు మృత్యువాత పడ్డాయి. పైడిభీమవరం పారిశ్రామికవాడలోని పలు పరిశ్రమలకు చెందిన రసాయన వ్యర్థాల పైపులైన్లు ఈ గెడ్డ పక్కన నుంచే వెళ్తూ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ రసాయన పైపులు లీకై గెడ్డ నీటిలో కలిసినప్పడు మత్స్య సంపదకు నష్టం వాల్లితుందని, అలాగే ఇటీవల కూడా రెండు పశువులు ఇలా వ్యర్థ జలాలు తాగి చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


