కంచిలి: స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం బీఎల్‌ఓలు, బీఎల్‌ఎల నిర్వహించి సమావేశం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి బీఎల్‌ఓలు 67 మంది, బీఎల్‌ఎలు మూడు రాజకీయ పార్టీలు కలిసి 201 మంది కలిపి మొత్తంగా 268 హాజరవ్వాల్సి ఉంది. కానీ సమావేశ మందిరంలో 80 కుర్చీలు మాత్రమే వేశారు. దీంతో కేవలం టీడీపీకి సంబంధించిన వారు మాత్రమే హాజరై.. వైఎస్సార్ సీపీకి చెందిన 67 మంది బీఎల్‌ఏలు బయటే వేచి చూసి వెనుదిరిగారు. స్థానిక ఎంపీపీని ఆ హ్వానించకుండానే సమావేశం నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ఎలాంటి పదవి లేని టీడీపీ నేతను వేదికపై కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. ఇది ఎంత వరకు సమంజసంగా ఉందని ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి ప్ర శ్నించారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి, నిష్పక్షపాతంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.


