● కొట్టుకుపోతున్న రిసార్టులు
● పట్టించుకోని పాలకులు
● నిరాశలో పర్యాటకులు
శ్రీకాకుళం రూరల్: జిల్లాలో సముద్ర తీర పర్యాట కం రానురాను కళా విహీనంగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం సందర్శకుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పెదగనగళ్లవానిపేట వద్ద కొద్ది నెలల ప్రభు త్వ అనుమతులతో ఏర్పాటు చేసిన ప్రైవేట్ రిసార్ట్ ఇప్పుడు అధ్వానంగా తయారైంది. నాగావళి నది నుంచి వచ్చిన నీరును వేరు చేయడానికి నది మధ్యలో ఏర్పాటు చేసిన గ్రోయిన్ రోడ్డు సైతం అర్ధంతరంగా ఆగిపోయింది. దీంతో సముద్రంలో ఆటుపోట్లు సంభవించినప్పుడు ఇక్కడ భారీ ప్రవాహంలా దూసుకొస్తుంది. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతలో ఉండే రోడ్లు, జీడిమామిడి తోట లు, చెట్లు, చేపల చెరువుల, భూములు, బారికేడ్లు సైతం కొట్టుకుపోతూ పెదగనగళ్లవానిపేట గ్రామం వైపు దూసుకొచ్చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు సైతం ఇటువైపు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
పర్యాటకులు రావడం లేదు..
మా గ్రామ పరిధిలో విశాలమైన సముద్రతీర ప్రాంతం ఉండటంతో పర్యాటకులతో నిత్యం కళకళలాడేది. ఇప్పుడు తీరమంతా కళా విహీనంగా మారడంతో శని, ఆదివారాలు సైతం ఇటువైపు రావడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. నిధులు మంజూరు చేసి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్ర భుత్వ పెద్దలు చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. – అప్పన్న, పెదగనగళ్లవానిపేట


