చరిత్ర, సంస్కృతి పరిరక్షణ సమితి ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

చరిత్ర, సంస్కృతి పరిరక్షణ సమితి ఏర్పాటు

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లాలో కొత్తగా వెలుగు చూస్తున్న ప్రాచీన చరిత్ర, సంస్కృతి అవశేషాలు, శిల్పాల పరిరక్షణకు, పురావస్తు శాఖ ప్రకటించిన స్థలాల రక్షణకు ఒక స్టీరింగ్‌ కమిటీ స్థానిక క్రాంతి భవన్‌ంలో గురువారం ఏర్పాటైంది. పురావస్తు చట్టాలను ఉల్లంఘించి, దంతపురం బౌద్ధ క్షేత్రాన్ని అన్యాక్రాంతం చేశారని, సంగమయ్య కొండ రూపురేఖలను మార్చి వేస్తున్నారని, శాలి హుండం కొండపై కొత్త ఆలయాల నిర్మాణం పేరుతో, చారిత్రక ఆనవాళ్లు ధ్వంసం చేస్తున్నారని శ్రీకాకుళం చరిత్ర, సంస్కృతి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ చరిత్ర పరిశోధకులు, ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్త ఆచార్య కేఎస్‌ చలం మార్గదర్శకత్వంలో ఒక పరిరక్షణ సమితి ఏర్పాటు చేయాలని సమా వేశం నిర్ణయించింది. దీనికోసం ఆరుగురితో ఒక స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యు లు, కళింగ సీమ ఉద్యమ నాయకులు డాక్టర్‌ డి. జీవితేశ్వరరావు, ప్రముఖ రచయితలు, పరిశోధకు లు నల్లి ధర్మారావు, దుప్పల రవికుమార్‌, మామిడి కోదండరావు, ప్రముఖ సైకత శిల్పి గేదెల హరికృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ సున్నపు చిన్నారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మందస ప్రాంతంలో ఇటీవల వెలుగు చూసిన ప్రాచీన జైన, బౌద్ధ మతా ల అవశేషాలను, విగ్రహాలను పరిరక్షించాలని కలె క్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు గురువారం ఉదయం ప్రాచీ న చరిత్ర, సంస్కృతి పరిరక్షణ సమితి ఒక వినతిపత్రం సమర్పించింది. ప్రత్యమ్నాయ స్థలం ఉన్నా, జైన విగ్రహం, మరికొన్ని అవశేషాలు కనిపిస్తున్న ఆలయ పరిసరాలను ధ్వంసం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే గోవర్ధనగిరి మెట్ట, ఆనంద గిరి మెట్ట పై బయటపడిన మరికొన్ని జైన, బౌద్ధ అవశేషాలను కూడా పరిరక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement