విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

టెక్కలి రూరల్‌: మండలంలోని బొప్పాయిపురం పంచాయతీ పరిధి చల్లపేట గ్రామంలో గురువారం విద్యుత్‌ షాక్‌కు గురై అదే గ్రామానికి చెందిన గురుజు ఈశ్వరరావు(చంటి)(19) అనే యువకుడు మృతిచెందాడు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చల్లపేట గ్రామానికి చెందిన మృతుడు ఈశ్వరరావు గ్రామం సమీపంలో గల జీడిబంద చెరువుకి బహిర్భూమికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతుండటంతో సంబంధిత కాంట్రాక్టర్‌ విద్యుత్‌ చౌర్యానికి పాల్పడి నీటి మోటార్‌ను ఏర్పాటు చేసి రోడ్డు వాటరింగ్‌ చేస్తుండేవారని, ఆ యువకుడు బహిర్భూమికి వెళ్లి అక్కడే ఉన్న విద్యుత్‌ వైర్‌పై కాలు వెయ్యడంతో ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే పడిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహు టిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అప్పడికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి తండ్రి ఎర్రయ్య, తల్లి లక్ష్మిలు ఉన్నారు. చేతికి అందివచ్చిన కుమా రుడు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement