శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రమాదం చేసిన వాహనం గుర్తించలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు వెల్లడించారు. ఆయన గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలోని హిట్ అండ్ రన్ ప్రమాదాలు, మోటారు యాక్సిటెంట్ విక్టిమ్ కాంపోజిషన్ స్కీం–2022 కింద త్వరితగతిన పరిహారం అందిస్తామన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం విస్తృతంగా ప్రచారం చేయా లని సూచించారు. ప్రతి మండలంలోనూ పోలీస్ శాఖ, డీఎల్‌ఎస్‌ఏలు సంయుక్తంగా హిట్ అండ్ రన్ పరిహారం గురించి అవగాహన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదం జరిగిన 60 రోజుల్లోపు బాధితులు ఎఫ్‌ఐఆర్ మెడికల్ రిపోర్ట్‌తో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేలా పోలీస్ అధికారులు సాయం చేయాలన్నారు. ప్రమాదం చేసిన వాహనం గుర్తించలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మరణం జరిగితే రూ.2,00,000, తీవ్ర గాయాలైతే రూ.50,000 వరకు పరిహారం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కెఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.పద్మావతి, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీసీఆర్‌బీ పి.శ్రీనివాసరావు, రషీద్ అహ్మద్, ఎస్ రామయ్య, బి ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.


