‘విద్యార్థినికి పరామర్శ’ | - | Sakshi
Sakshi News home page

‘విద్యార్థినికి పరామర్శ’

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

పలాస: మెళియాపుట్టి మండలం భరిణికోట గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పలాస మండలం లొత్తూరు పంచాయితీ హల్ధిగాం గ్రామానికి చెందిన నవ్యశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపించాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పలాస ప్రభు త్వ ఆస్పత్రిలో గురువారం ఆమె చికిత్స పొందు తుండగా ఆమెను కలిసి పరామర్శించారు. ఈ ఘటనకు జరిగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఉదయం ప్రేయర్‌ అనంతరం ఆమె వసతి గృహంలోకి వెళ్తుండగా ఆమెను ఫిజిక్స్‌ టీచర్‌ వసంత బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్లడంతో ఆమె మనస్తాపానికి గురై ఇలా చేసిందని తెలిపారు. గిరిజన సంఘం నాయకుడు సవర జగన్నాయకులు, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.వినోద్‌, లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు మద్దిల రామారావు, జనశక్తి జిల్లా నాయకుడు కోనేరు రమేష్‌, గిరిజన సంఘాల నాయకులు సవ ర నరిసింహులు, కుమార్‌బంగ్లా, సవర రవి, సవర సింహాద్రి తదితరులు పరామర్శించారు. విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement