లేని అనారోగ్యాన్ని సృష్టించి నిజాన్ని చంపేస్తారా? | - | Sakshi
Sakshi News home page

లేని అనారోగ్యాన్ని సృష్టించి నిజాన్ని చంపేస్తారా?

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

లేని అనారోగ్యాన్ని సృష్టించి నిజాన్ని చంపేస్తారా?

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ):

రైతు సేవాకేంద్రం వద్ద ప్రాణాలు కోల్పోయిన మహిళా రైతు కాంతమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ టెక్క లి సమన్వయకర్త పేరాడ తిలక్‌ స్పష్టం చేశారు. ఎరు వుల కోసం వెళ్లి చిన్న గదిలో క్యూలో గాలి ఆడక, ఆ లైనులో నిలబడలేక కాంతమ్మ మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులే చెబుతుంటే.. దాన్ని కప్పిపుచ్చేందుకు కలెక్టర్‌, మంత్రులు ఆరోగ్య సమస్యలను తెర మీదకు తీసుకురావడం దారుణమన్నారు. కాంతమ్మ కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కాంతమ్మ ఆ రోజు నందిగాం మండలం పెద్దలేల్లపల్లి నుంచి నేషనల్‌హైవేపై లట్టిగాంలో ఉన్న ఆర్‌ఎస్‌కే వరకు నడిచి వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు క్యూలో నిలబడి మృత్యువాత పడిందని స్పష్టం చేశారు. దీన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాలన్నారు. గత మూడు నెలలు గా ఆమె ఒక్క మందు బిళ్ల కూడా వేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఆమె మందులు వాడినట్టు కలెక్టర్‌, మంత్రి, వ్యవసాయాధికారులు నిరూపించగలరా అని ప్రశ్నించారు.

క్యూలో తోపులాట జరుగుతోందని 3.28 నిమిషాలకు అక్కడే ఉన్న జనసేన నాయకుడు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కి ఫోన్‌ చేస్తే స్పందించకపోతే 100కి కాల్‌ చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీ సుల చేత కుటుంబ సభ్యుల్ని సైతం బెదిరించి శవం దగ్గర ఉండనివ్వకుండా, కనీసం ఏడవనీయకుండా బయటకు పంపించేశారని పేర్కొన్నారు. వ్యవసా య శాఖ మంత్రి, అయన అన్నదమ్ములు యూరి యాను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటున్నారని, దీనిపై విచారణ చేయాలని కోరారు. టెక్కలి నియోజకవర్గంలో ఓ ఇద్దరు సైనికులు వీరమరణం చెందితే ఇప్పటివరకు వాళ్ల కుటుంబాలకు పైసా చెల్లించలేదన్నారు.

సమావేశంలో కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు నందిగాం ఎంపీపీ శ్రీరామ్మూర్తి, మాజీ ఎంపీపీ చక్రవర్తి, కణితి నారాయణమూర్తి, పూడి ఆశారాణి, వంజంగి లోకనాథం, బడ్డ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గత మూడు నెలలుగా ఆమె ఒక్క మందు బిళ్ల కూడా వేయలేదు

కాంతమ్మ మందులు వాడినట్టు కలెక్టర్‌, మంత్రి, వ్యవసాయాధికారులు

నిరూపించగలరా..!

రైతు మృతిపై రాజకీయమా

మృతురాలి కూతురు వంజంగి సుమతి, భానుమతి, మనవడు లోకనాథంలు మాట్లాడుతూ అమ్మ మృతి చెందినప్పుడు అక్కడే ఉన్నామని మృతదేహం దగ్గరకు కూడా చేరనివ్వలేదని, ఏడ్చేందుకు కూడా అవకాశం లేకుండా దూరంగా తీసుకెళ్లిపొమ్మన్నారని తెలిపారు. మృతికి సంబంధించి, అక్కడ జరిగిన సంఘటలన్నీ ఆరు వీడియోలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు.

ఎరువుల కోసం క్యూలో నిలబడడం వల్లే మరణం

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..!

ఆరోగ్యం బాగోలేక చనిపోయిందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం దారుణం

కలెక్టర్‌, మంత్రి, జేడీ, ఏడీలపై కేసు నమోదు చేయాలి

మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement