ఏం పాపం చేశామని.. | - | Sakshi
Sakshi News home page

ఏం పాపం చేశామని..

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

ఏం పాపం చేశామని..

ఎనిమిదేళ్లుగా

వెంటాడుతున్న కేసులు

నరకం చూస్తున్న

వంశధార నిర్వాసితులు

దారుణం..

కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. కోర్టు వాయిదాలకు తిరగలేకపోతున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు కొట్టివేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకూ ఆ ఊసేలేదు. కనీసం ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడం దారుణం.

– గొర్లె మోహన రావు నిర్వాసితుడు, హిరమండలం

కూటమి ప్రభుత్వం డ్రామా..

నిర్వాసితులపై కేసులను ఎత్తివేసే విషయంలో కూటమి ప్రభుత్వం డ్రామాలాడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కానీ తర్వాత ఆ ఊసే లేదు.

– రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం

హిరమండలం:

వంశధార నిర్వాసిత గ్రామానికి చెందిన ఓ యువకుడు దుబాయ్‌లో ఓ కంపెనీలో పనికి కుదిరాడు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ పోలీస్‌ ఎంకై ్వరీలో ఆయనపై కేసులు ఉన్నాయని తేలడంతో పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రం రాలేదు. వాస్తవానికి ఆ యువకుడు ఎలాంటి నిరసనల్లో పాల్గొన లేదు. కానీ అప్పట్లో కేసు నమోదైంది.

వంశధార నిర్వాసిత గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని ప్రాజెక్టు కోసం కోల్పోయాడు. కానీ అప్పట్లో గ్రా మాలను ఖాళీ చేసే సమయంలో రైతులు నిరసన తెలిపారు. దీంతో ఆయనపై కూడా కేసు నమోదైంది. ఎక్కడో ఒడిశాలో బంధువుల గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నాడు. కోర్టు వాయిదాలకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు.

ఈ ఇద్దరు మాత్రమే కాదు. 13 వంశధార నిర్వాసిత గ్రామాల్లో వందలాది మంది పరిస్థితి ఇలాగే ఉంది. తొమ్మిదేళ్ల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణ, గ్రామాలను ఖాళీ చేసే సమయంలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ సమయంలో కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో వివాదంతో అస్సలు సంబంధం లేని వ్యక్తులు, దివ్యాంగులు, నడవలేని వారు, వృద్ధులపై సైతం కేసులు నమోదుచేశారు. అసలు ఈ గొడవలతో సంబంధం లేకపోయినా వివిధ మార్గాల్లో పేర్లు సేకరించి హిరమండలం, కొత్తూరు, ఆమదాలవలస పోలీస్‌స్టేషన్లలో చాలా మందిపై కేసులు నమోదు చేశారు. ఇలా దాదాపు 1500 కేసులు నమోదైనట్టు పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయి.

కార్యరూపం దాల్చని హామీ..

కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిర్వాసితులపై కేసులు ఎత్తివేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా కేసులను మాత్రం ఎత్తివేయలేదు. ఇటీవల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం నిర్వాసితులు వినతిపత్రం అందించారు. కానీ ఇంతవరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదు. 2018కి ముందు నిర్వాసితులు తమ సమస్యలపై పలు రూపాల్లో పోరాటాలు, ఆందోళనలు జరిపారు. ఆ సమయంలో వందలాది కేసులు నమోదయ్యాయి. అలా బాధితులుగా మారిన వారు ఇప్పటికీ కోర్టు మెట్లు ఎక్కుతూ నే ఉన్నారు. కొన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఇంకా కొనసాగుతున్నవే అధికం. ఈ కేసుల్లో చిక్కుకున్న వారిలో విద్యార్థులు, నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు వీలుగా పాస్‌పోర్టులు పొందలేకపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వంశధార నిర్వాసితులపై లాఠీచార్జ్‌ చేస్తున్న పోలీసులు (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement