మమ్మల్ని బతకనివ్వండి | - | Sakshi
Sakshi News home page

మమ్మల్ని బతకనివ్వండి

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

కొండే మా బతుకులకు అండ

ప్రభుత్వం తీసుకుంటే మేమెలా బతకాలి

నడిమివలసలో తిరగబడిన ప్రజలు

సెంటు భూమి కూడా వదలం

మేము సెంటు భూమి కూడా ఇవ్వ దలచుకోలేదు. ఈ కొండ లేకపోతే మాగ్రామస్తులు జీవనోపాధి కోల్పో తారు. అవసరమైతే పోరాటలు చేసి మా కొండను కాపాడుకుంటాం. – బాలి రమేష్‌, నడిమివలస

ఏ ఆధారం లేదు

మాకు ఎలాంటి ఆధారం లేదు. ఈ కొండపై ఇచ్చిన పట్టాలతో జీవిస్తు న్నాం. ప్రభుత్వం ఈ కొండను తీసుకుని పెద్దలకు అప్పగించడానికి చర్యలు తీసుకున్నారు. ఇలా చేస్తే మా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తాం. – ఆబోతుల జగన్నాథం, నడిమివలస

మాకు ఇదే ఆధారం

నా చిన్నతనం నుంచి ఈ కొండపైనే సాగు చేసుకుంటున్నాం. మా భూములను పెద్దలకు అప్పగించడం ఎంత వరకు న్యాయం. ప్రాణాలకు తెగించైనా మా భూమిని కాపాడుకుంటాం.

– బాలి అసిరినాయుడు, నడిమివలస

జి.సిగడాం:

‘మేం పేదవాళ్లం.. మాకు ఉండేది ఈ కొండ మాత్రమే. మాకు భూములు లేవు. కొండ మీద చెట్లు, చిన్నపాటి వ్యవసాయ పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. మాతో పాటు మా ఆవులు, మేక లు, గొర్రెలకు ఈ కొండే ఆధారం. ఆ కొండ లేకుంటే మాకు బతుకు లేదు’ అంటూ నడిమివలస వాసులు రోడ్డెక్కారు.

నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారుగా 202 ఎకరాలను ప్రభు త్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ కొండలో ఏపీఐఐసీ పరిశ్రమ వాడగా ఏర్పా టు చేయడానికి అధికార యంత్రాంగం ముందడుగు వేసింది. సర్వే నంబర్‌ 36.38లో 202 ఎకరాలపై ఉన్న రైతులు ఆదివారం గ్రామంలో ఉన్న రామమందిరం వద్ద సమావేశమయ్యారు. కొండపైనే ఆధారపడి బతుకుతున్నామని, కొండను ఇవ్వబోమని అన్నారు. సచివాలయంలో ఇదివరకు నిర్వహించిన గ్రామసభలో ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు.

తీర్మానించాం..

మాకు తెలియకుండా వేరే తీర్మానాలు చేస్తే సహించేది లేదు. పరిశ్రమల వాడకు భూములు ఎవరూ ఇవ్వవద్దు. ఆ మేరకు మేం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

– బాలి సావిత్రమ్మ, మాజీ సర్పంచ్‌, నడిమివలస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement