ఎరువుల పంపిణీలో వివక్ష | - | Sakshi
Sakshi News home page

ఎరువుల పంపిణీలో వివక్ష

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

జలుమూరు: అల్లాడ ప్రాథమిక సహకార సంఘం పరిధి గొటివాడలో ఆదివారం యూరియా పంపిణీ వివాదాస్పదమైంది. అల్లాడపేటకు చెందిన రైతులకు కనీసం ఒక్క బస్తా కూడా యూ రియా ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులకు నిబంధనలకు విరుద్ధంగా ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు అందించారు. నిబంధనల ప్రకారం ఎకరాకు రెండు బస్తాలు యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోవడం లేదని అల్లాడపేటకు చెందిన రైతులు కల్యాణం శ్రీనివాసరావు, వెలమల అప్పారావు, కల్యాణం సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువు తీసుకోవాలంటే ఉదయం నుంచి సా యంత్రం వరకు నిరీక్షించాల్సి వస్తోందని, టీడీపీ వారికి మాత్రం నిబంధనలు వర్తించడం లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement