సర్‌ | - | Sakshi
Sakshi News home page

సర్‌

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026 అంతా అయోమయమే సర్‌

న్యూస్‌రీల్‌

గందరగోళంగా లెక్కలు

ఎన్యుమరేషన్‌ ఫారాలు అందలేదని

ఇంకా చెబుతున్న ఓటర్లు

100 శాతం పంపిణీ చేసినట్టు చెబుతున్న కలెక్టర్‌

డిజిటలైజేషన్‌ నెమ్మదే

శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
అంతా అయోమయమే

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

టర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)తప్పుల తడకలా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఓటర్లు తమకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందలేదు మొర్రో అంటుంటే జిల్లాలోని ఓటర్లందరికీ ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసినట్టు కలెక్టర్‌ చెబుతున్నారు. వంద శాతం పంపిణీ జరిగిపోయినట్టు అధికారులు తేల్చేశారు. ఇప్పుడంతా డిజిటలైజేషన్‌ చేసే పనిలో ఉన్నామని, అది కూడా 90.39శాతం జరిగినట్టు చెబుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే ఓట్లు గోల్‌మాల్‌ అయ్యే పరిస్థితి కనబడుతోంది.

మరో రెండు రోజుల్లో సర్‌ ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఎవరి ఓట్లు ఉంటాయో, ఎవరి గల్లంతవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, జిల్లాలో ఓటర్లందరికీ 100 శాతం ఎన్యుమరేష న్‌ ఫారాలు పంపిణీ చేసినట్టు చూపిస్తున్నారు. ఈ లెక్కన ఇంకా ఎన్యుమరేషన్‌ ఫారాలు అందలేదని గగ్గోలు పెడుతున్న వారి ఓట్లు ఏమవుతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తేడాలుంటే ఫారం 6 ద్వారా కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చి వదిలేస్తున్నారు. మొత్తంగా సర్‌ కార్యక్రమం గందరగోళంగా ఉందని చెప్పాలి.

జిల్లాలో 18,97,405 ఓటర్లు ఉండగా వారందరికీ 100శాతం ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు 16లక్షల 97వేల 988(89.49శాతం)మంది నుంచి ఎన్యుమరేషన్‌ ఫారాలు సేకరించినట్టు చూపిస్తున్నారు. వీటిలో 90.30శాతం ఓట్లు డిజిటలైజేషన్‌ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, హౌస్‌ టూ హౌస్‌ సర్వేలో షిఫ్టింగ్‌, ఆబ్సెంట్‌, మరణాలు, డూప్లికేటు ఆల్రెడీ ఎన్‌రోల్‌ మెంట్‌ (ఎఎస్‌డీడీ ఓటర్లు) కింద 74,438 ఓట్లు ఉన్నాయని గుర్తించినట్టు నివేదికలో పొందుపరిచారు. అదే విధంగా సర్‌ ప్రక్రియలో ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చాక ఏఎస్‌డీడీ(ఆబ్సెంట్‌, షిప్టింగ్‌, డెత్‌, డూప్లికేట్‌) ఓటర్లుగా మరో 81,073మంది ఉండటంతో ఆ ఫారాలు తిరిగి రాలే దని లెక్కల్లో చూపిస్తున్నారు. ఈ లెక్కలన్నీ అంతు చిక్కడం లేదు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇవ్వలేదని ఓటర్లు చెబుతుంటే, మరోవైపు 100 శాతం పూర్తయినట్టు అఽధికారులు చెప్ప డం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదంతా చూస్తుంటే చివరిలో నాట్‌ ట్రేస్డ్‌ కాలమ్‌గా పెట్టి లక్షలాది ఓట్లు చూపించే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.

జిల్లాలో ఉన్న ఓటర్లు : 18,97,405

డిజిటలైజేషన్‌ చేసిన ఫారాలు : 90.30 శాతం

జిల్లాలో పోలింగ్‌ బూత్‌లు :

2358

పంపిణీ చేసిన ఎన్యుమరేషన్‌ ఫారాలు :100 శాతం

వెనక్కి వచ్చిన ఫారాలు : 89.49 శాతం

ఎన్యుమరేషన్‌ ఫారాలు రాని ఏఎస్‌డీడీ ఓటర్లు : 81,073

హౌస్‌ టూ హౌస్‌ సర్వేలో గుర్తించిన ఏఎస్‌డీడీ ఓటర్లు : 74,438

ఇచ్ఛాపురం రూరల్‌: ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ లొద్దపుట్టిలో 56,57,58,59 పోలింగ్‌ కేంద్రాల్లో ‘సర్‌’ పురోగతి మందగించిందని, వెంటనే 90 శాతం లక్ష్యాన్ని తప్పని సరిగా పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ డిజిటలైజేషన్‌ నత్తనడకనే సాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న ద్వంద్వ ఓటర్లును తొలగించాలని సూచించడంతో ఆ పనిలో బీఎల్వోలు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement