సరుబుజ్జిలి: ఎరువుల పంపిణీ సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని సహకార సంఘం ఉద్యోగులపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని చినకాగితాపల్లి గ్రామ సచివాలయం వద్ద నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ, సర్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీ సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా రైతులను క్రమ పద్ధతిలో ఉంచాలని ఆదేశించారు. ఓటీపీ ద్వారా మాత్ర మే రైతులకు ఎరువులు పంపిణీ చేయాలన్నా రు. డీఎపీ కొరత అధికంగా ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిశీలనలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, పలువురు అఽధికారులు ఉన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్‌లో శనివారం అధిక సంఖ్యలో కేసులు పరిష్క రించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా, ఇతర న్యాయమూర్తులు జిల్లా కోర్టులో ఈ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 13,555 కేసులు పరిష్కరించారు. వీటికి గాను రూ.8.63 కోట్లు నగదును కక్షిదారులకు చెల్లించారు.


