కేఆర్‌ స్టేడియం పనులకు రూ.5 కోట్ల బకాయిలు చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

కేఆర్‌ స్టేడియం పనులకు రూ.5 కోట్ల బకాయిలు చెల్లింపు

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం పనులకు సంబంధించిన రూ.5 కోట్ల పెండింగ్‌ బకాయిలు ఇటీవల చెల్లించామని.. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఇండోర్‌ స్టేడియం పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని మరో మూడు నెలల్లో పూర్తిచేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా షటిల్‌ బాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నారాయణశెట్టి వెంకట శ్రీనివాసులు జ్ఞాపకార్ధం శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండు రోజుల జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీలను జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు, చైర్మన్‌ ఆర్‌.రాజేంద్రన్‌, అధ్యక్షుడు కె.సాగర్‌, కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎన్‌.వి.కిరణ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు బి.దామోదరరావు, కేఎస్‌ మదీనా శైలానీ, ఎం.రత్నాజీ, కోశాధికారి జి.అనిల్‌కుమార్‌, జి.ప్రసాద్‌, జి.అనిల్‌కుమార్‌, ఎం.శాంతికుమార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ గురుగుబెల్లి రాజు, ఐ.ఆశాలత, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, మ్యాచ్‌ పాయింట్‌ ఛైర్మన్‌ హైదారాబాద్‌ ముప్పాల వేణు, రవి, మాధురి, సంఘ ప్రతినిధులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సాగుతున్న పోటీలు..

జిల్లాస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో అండర్‌–11, 13, 15, 17, 19, సీనియర్స్‌(మెన్‌,ఉమెన్‌) విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రంతో పోటీలు ముగియనున్నాయని మీట్‌ స్పాన్షర్‌, జిల్లా బాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి నారాయణశెట్టి వెంకట కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈ టోర్నీకి చీఫ్‌ రిఫరీగా ఎస్‌.సూరిబాబు వ్యహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement