టెక్కలి సీఐపై తప్పుడు వీడియో పోస్టింగులు | - | Sakshi
Sakshi News home page

టెక్కలి సీఐపై తప్పుడు వీడియో పోస్టింగులు

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న తరుణ్‌కుమార్‌పై రౌడీషీట్‌

టెక్కలి: పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న టెక్కలి కోదండ రామవీధికి చెందిన కొమ్ము తరుణ్‌కుమార్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో పోస్టింగులు పెట్టాడని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తరుణ్‌కుమార్‌ గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉండటమే కాకుండా రిమాండ్‌కు కూడా వెళ్లాడని చెప్పారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉంటూ వ్యసనాలకు బానిసగా మారి పలు మోసాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. మోసాలు బట్టబయలు కావడంతో తదుపరి నేరాలు చేసే అవకాశం ఉండదని భావిస్తూ సీఐ విజయ్‌కుమార్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు వీడియో పోస్టింగ్‌లు చేశాడని పేర్కొన్నారు. చట్ట విరుద్దమైన నేరాలు, చట్ట వ్యతిరేక పనులు చేస్తుండటంపై టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో తరుణ్‌కుమార్‌పై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ విజయ్‌కుమార్‌ ఉన్నారు.

ముగ్గురికీ ఒకేచోట అంత్యక్రియలు

జలుమూరు: మర్రివలస గ్రామంలో ముద్ద దాలప్పమ్మ, కుమార్తెలు దాలమ్మ, సరస్వతిలు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం, పంచనామా అనంతరం కొందరు బంధువులు, మరో కుమార్తె లక్ష్మీతో కలిసి గ్రామస్తులు ముగ్గురి మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామ యువత, మరికొందరు కలిసి కొంత నగదు సేకరించి మూడు మృతదేహాలను ఒకే చోట అంత్యక్రియలు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement