నేను చాలా ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. 2024 లో కూడా ఓటు వేశాను. ఇప్పుడు నా వయసు 70 ఏళ్లు. మా కుటుంబంలో నాతో పాటు భార్య, కోడలు ముగ్గురికీ ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి మళ్లీ తీసుకున్నారు. ఏమని అడిగితే మీ ఓటు మ్యాపింగ్ కాలేదు అంటున్నారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. బీఎల్‌ఓ వద్దకు రోజూ వెళ్తున్నా స్పందించడం లేదు. సర్ పేరున మా ఓట్లు లేకుండా చేస్తున్నారు. మా ఓట్లు లేకపోవడం ఏమిటి. బీఎల్‌ఓలు, ఇతర అధికారులదే తప్పు.
– పొట్నూరు రామసోమేశ్వర గుప్త, స్టేట్‌బ్యాంకు వీధి, నరసన్నపేట


