వైఎస్సార్‌సీపీ హయాంలో..
నాడు
నేడు
ఈ రెండు ఫొటోలు రెండు వేర్వేరు ప్రభుత్వాల హయాంలోనివి. మొదటి ఫొటోలో రైతు హాయిగా ఎరువు తీసుకుంటున్న చిత్రం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలోనిది. జి.సిగడాం మండలం ముషిణివలసలో తీసిని చిత్రమిది. అప్పట్లో ఎలాంటి క్యూలు అవసరం లేకుండా ఎరువులు ఇచ్చే వారు. ఇక రెండో ఫొటో శుక్రవారం నాటిది. బూర్జ మండలంలోని అల్లెన గ్రామంలో గల సచివాలయంలో శుక్రవారం ఉదయం నుండే రైతన్నలు ఎరువుల కోసం బారులు తీరారు. ఓటీపీ రావడం లేదని గంటల కొద్దీ రైతులను ఎండలోనే నిలుచోబెట్టారు. – బూర్జ, జి.సిగడాం


