సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్ సీపీలో కొత్త నియామకాలు జరిగాయి. రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన అంధవరపు సూరిబాబును సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(సీఈసీ) సభ్యులుగా నియమించగా, ఖాళీ అయిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కళింగ వైశ్య, కళింగ కోమటి విభాగం అధ్యక్షుడి స్థానానికి పట్నాల శ్రీనివాసరావు (కోణార్క్ శ్రీను) నియామకమయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ కళింగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన పట్నాల శ్రీనివాసరావు రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షునిగా పనిచేశారు. వైఎస్సార్‌సీపీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ వస్తున్నారు. సేవలను గుర్తిస్తూ తాజాగా నియమించా రు. ఇంతవరకు రాష్ట్ర కళింగ వైశ్య, కళింగ కోమటి అధ్యక్షునిగా పనిచేసిన అంధవరపు సూరిబాబు సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమించారు. ఆయన తొలుత జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, సీఈసీ సభ్యుడిగా, నగర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అధికారంలోకి వచ్చాక కళింగ వైశ్య విభాగం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. నెల్లిమర్ల, ఎచ్చెర్ల నియోజకవర్గ పరిశీలకులగా వ్యవహరించారు. తాజాగా నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులయ్యారు. కోణార్క్ శ్రీనుకు, అంధవరపు సూరిబాబుకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలియజేశాయి.
● వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా అంధవరపు సూరిబాబు
● రాష్ట్ర కళింగ వైశ్య,
కళింగ కోమటి విభాగం అధ్యక్షుడిగా కోణార్క్ శ్రీను నియామకం
● శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం


