కొత్తవి వచ్చేదెప్పుడట? | - | Sakshi
Sakshi News home page

కొత్తవి వచ్చేదెప్పుడట?

Jul 11 2026 1:18 AM | Updated on Jul 11 2026 1:18 AM

పాతవి పనికిరావట.. కొత్తవి వచ్చేదెప్పుడట? ● మీ–సేవా కేంద్రాలు, సచివాలయాల్లో నిలిచిన సర్టిఫికెట్ల జారీ ● సచివాలయాల పేరిట ఉన్న పత్రాలు ముద్రణకు వాడొద్దని ప్రభుత్వం ఆదేశం ● ఇంకా జిల్లాకు చేరని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు పత్రాలు ● ప్రింటింగ్‌ చేసేందుకు పత్రాలు లేక నిర్వాహకుల పాట్లు ● ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టినా పంపించడం లేదని ఆవేదన ఇదీ పరిస్థితి.. అన్నింటికీ ఆధారం.. ఇదేం తీరు..

లక్ష మంది ఎదురుచూపులు..

15 రోజులుగా ఇబ్బంది..

పాతవి పనికిరావట..
● మీ–సేవా కేంద్రాలు, సచివాలయాల్లో నిలిచిన సర్టిఫికెట్ల జారీ ● సచివాలయాల పేరిట ఉన్న పత్రాలు ముద్రణకు వాడొద్దని ప్రభుత్వం ఆదేశం ● ఇంకా జిల్లాకు చేరని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు పత్రాలు ● ప్రింటింగ్‌ చేసేందుకు పత్రాలు లేక నిర్వాహకుల పాట్లు ● ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టినా పంపించడం లేదని ఆవేదన

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ :

ప్రభుత్వం నిర్వాకం కారణంగా విద్యార్థులు, వివిధ వర్గాల వారు కుల, ఆదాయ, నివాస తదితర సర్టిఫికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ–సేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ‘సచివాలయాలు’ పేరిట ఉన్న పత్రాలు పనికిరావని, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు పేరిట ఉన్న పత్రాలపైనే సర్టిఫికెట్లు ప్రింటింగ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ధ్రువపత్రాల జారీ ప్రక్రియ 15 రోజులుగా నిలిచిపోయింది. కొత్త పత్రాల కోసం ఇండెంట్‌ పెట్టినా ఇంతవరకు రాకపోవడంతో మీ– సేవ కేంద్రాల నిర్వాహకులు, సచివాలయ సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు.

మీ సేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ రకాల ధ్రువపత్రాలను ముద్రించే పత్రాలు కరువయ్యాయి. కొన్నిచోట్ల 20 రోజులుగా ఈ ప్రక్రి య నిలిచిపోయింది. ఈ పత్రాలు కోసం మీ–సేవ కేంద్రాల ఆపరేటర్లు పది రోజుల క్రితమే విజయవాడలో సంబంధిత ఏజెన్సీకార్యాలయానికి నగదుని ఆన్‌లైన్‌లో చెల్లించి ఇండెంట్లు పెట్టారు. ప్రతి 1000 పత్రాలకు రూ.3400 చొప్పున చెల్లించారు. ఇప్పటికి 15 రోజులు గడుస్తున్నా పత్రాలు రాలేదు.

జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలు 460 వరకు ఉన్నాయి. మీసేవ కేంద్రాలు 115 వరకు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 20 శాఖల సంబంధించి 60 సేవల ధ్రువపత్రాలను వీటి ద్వారానే మంజూరు చేస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ, సర్వే శాఖ, పోలీస్‌, ట్రాన్స్‌పోర్టు, కార్మిక శాఖ, మున్సిపల్‌ విభాగం, రిజిస్టర్‌ కార్యాలయం, సహకార శాఖ తదితర శాఖలకు సంబంధించి ధ్రువపత్రాలను సచివాలయం, మీసేవ కేంద్రాల ద్వారానే లబ్ధిదారులకు అందజేస్తారు.

మీసేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లోనూ ముందు జాగ్రత్తగా ఆపరేటర్లు పెద్ద ఎత్తున పత్రాలు తెప్పించుకున్నారు. అయితే ఆ పత్రాలు ప్రస్తుతం వాడరాదని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటికే వేలల్లో పత్రాలు కొనుగోలు చేసుకున్న వారంతా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ వార్డు సచివాలయాల స్థానంలో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాలని పేరు పెట్టింది. దీనితో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు పేరున ముద్రించిన పత్రాలనే వివిధ శాఖలు మంజూరు చేసిన ధ్రువపత్రాలుగా వాడాలని ఆదేశాలు జారీ చేసింది. వీటి కోసం ఇండెంట్‌ పెట్టినా సకాలంలో రాకపోవడంతో ధ్రువపత్రాలు మంజూరు సమస్య జఠిలంగా మారింది.

ప్రస్తుతం ఈ సేవలు నిలిచిపోవడంతో సుమారు లక్ష మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రధానంగా కుల, ఆదాయం, ఓబీసీ, క్రిమీలేయర్‌ వంటివి సంబంధిత అధికారి సంతకం చేసి సిఫారసు చేసినా పత్రాలు లేకపోవడంతో పొందలేకపోతున్నారు. వీటితో పాటు వన్‌ బి, అడంగల్‌ వంటి రెవెన్యూ సేవలు కూడా నిలిచిపోయాయి. వీటి ద్వారా ప్రతిరోజు వేలాది ధూపత్రాలు రిజిస్ట్రేషన్‌ చేయడం మంజూరు చేయడం ముద్రించే లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ ముద్రణ పత్రాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

నా కుమారుడి చదువు కోసం వివిధ ధ్రువపత్రాల కోసం సచివాలయంలో దరఖా స్తు చేసుకున్నాం. తహశీల్దార్‌ ఆమోదం కూడా తెలిపారు. అయినా పత్రాలు లేవని సచివాలయంలో ధ్రువపత్రం ఇవ్వడం లేదు. పాత ఫారాలు ఉన్న చెల్లుబాటు కావని చెబుతున్నారు. – బి.ఆదినారాయణ, శ్రీకాకుళం రూరల్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement