కాంట్రాక్ట్‌ అధ్యాపక పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ అధ్యాపక పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు

Jul 11 2026 1:18 AM | Updated on Jul 11 2026 1:18 AM

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో సబ్జెక్టు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేసేందుకు అధ్యాపక పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16 న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య తెలిపారు. వర్సిటీలోని ఐటీఈపీ విభాగంలో ఫిజిక్స్‌ కోర్‌ సబ్జెక్ట్‌లో ఒకటి, పొలిటికల్‌ సైన్స్‌లో ఒకటి, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో ఒక సబ్జెక్ట్‌, కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీ పోస్టు భర్తీ చేస్తామన్నారు. వీటితో పాటుగా మెయిన్‌ లైబ్రరీలో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్ట్‌ (కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన) భర్తీ చేస్తామని ఆయన అన్నారు. పీహెచ్‌డీ పూర్తి చేసి నెట్‌, సెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అధ్యాపక పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఎంఎల్‌ఐసీ చేసిన వారు అదే కోర్సులో పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ (కాంట్రాక్ట్‌) పోస్ట్‌ భర్తీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత సర్టిఫికెట్లు జత చేసి జూలై 16 ఉదయం 10 గంటలకు వర్సిటీ పరిపాలన భవనంలో జరిగే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన కోరారు. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి పొందాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement