పలాస: అసమానతలు లేని సమాజం కోసం విద్యార్థులు పాటుపడాలని, అందుకు శాసీ్త్రయ విజ్ఞానం చాలా అవసరమని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరప్పడు అన్నారు. కాశీబుగ్గలోని టి.కె.ఆర్. కల్యాణ మండపంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర విద్యావైజ్ఞానిక శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా పి.డి.ఎస్.యు. పతాకాన్ని సంఘం అధ్యక్షుడు కె.భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సూరప్పడు మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, దోపిడీ పీడన లేని సమాజం కోసం ఈ జిల్లాలో గొప్ప ఉద్యమం జరిగిందని, అందులో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ఇక్కడ ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం శుభపరిణామమని చెప్పారు. పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్, ఎం.వినోద్ మాట్లా డుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాటిని అమలు చేయ డం లేదని దుయ్యబట్టారు. ఉన్నత విద్యా ఉపాధి సవాళ్లు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్‌పట్నాయక్, సామాజిక మార్పు విద్యార్థుల పాత్ర అంశంపై ఎ.పి.టి.ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పి.డి.ఎస్. యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.రాజశేఖర్, ఎం.సునీ ల్, అంకన్న, సహాయ కార్యదర్శి రాజేష్, నాని, వీరుంద్ర, ప్రసాద్, లోకేష్, కోశాధికారి మహేంద్ర, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సొర్ర రామారావు, ఎస్.సోమేశ్వరరావు, కృష్ణవేణి, పి.వో.డబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.ఈశ్వరమ్మ, పి.కుసుమ, ఇఫ్టూ నాయకులు జుత్తు వీరాస్వామి, గొరకల బాలకృష్ణ పాల్గొన్నారు.


