నాయీ బ్రాహ్మణుల నిరసన | - | Sakshi
Sakshi News home page

నాయీ బ్రాహ్మణుల నిరసన

Jul 11 2026 1:18 AM | Updated on Jul 11 2026 1:18 AM

నాయీ బ్రాహ్మణుల నిరసన

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఒంగోలులో దారుణ హత్యకు గురైన మహేంద్ర కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు టి.తిరుపతిరావు, జిల్లా అధ్యక్షుడు కె.గజపతిరావు, జిల్లా సాధికార సమితి కన్వీనర్‌ కె. వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద శుక్రవా రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో సెలూన్‌ నడుపుతూ జీవిస్తున్న మహేంద్ర వద్దకు జూలై 2న రామారావు అనే వడ్డీ వ్యాపారి వచ్చి దురుసుగా వ్యవహరించాడని, షేవింగ్‌కు నిరాకరించినందుకు కత్తెరతో పొడిచి చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మహేంద్ర కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ఒకరికి ఉపాధి కల్పించాలని, 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కె.నాగరాజు, ఆర్‌.శంకరావు, కె.ఈశ్వర్‌, సి.హెచ్‌.కన్నయ్య, జి.శ్రీను, సి.హెచ్‌.లక్ష్మణరావు, పి.సురేష్‌, కె.కృష్ణ, జి.దుర్గాప్రసాద్‌, చిట్టిభాను, ఎస్‌.శ్రీను, కె.నీలాద్రి, కె.శశి, ఏ.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement