సేద్యంలో శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలి | - | Sakshi
Sakshi News home page

సేద్యంలో శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలి

Jul 11 2026 1:18 AM | Updated on Jul 11 2026 1:18 AM

సేద్యంలో శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలి

రణస్థలం: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభా వం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు ప్రణాళిక తో పాటు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఏరువాక కేంద్రం, విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఎం.వి.శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పైడిభీమవరంలో నిర్వహించిన రైతు మిత్రల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, పంటల నిర్వహణలో శాసీ్త్ర య సూచనలను పాటించడం చేయాలన్నారు. నేల ను పంట వ్యర్థాలతో కప్పడం, దేశవాళీ విత్తనాలు వాడటం, జీవ ఉత్పేరకాలు వినియోగించడం, మిశ్రమ పంటలు వేయడం ద్వారా రైతులు పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ తేజేశ్వరరావు, డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ డిప్యూటీ మేనేజర్‌ ఆర్‌.హరిబాబు, ప్రకృతి వ్యవసాయ మాస్టర్‌ ట్రైనర్‌ కంబపు కృష్ణ, ఏరి యా మేనేజర్‌ తవిటినాయుడు, దేవుడుబాబు, రంభ, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement