శ్రీకాకుళం: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 14న కలెక్టరెట్ ఎదుట భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామమూర్తి, జనరల్ సెక్రటరీ పడాల ప్రతాప్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని ఫ్యాప్టో కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి పోస్టర్ ఆవిష్కంచారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లు చేయాలని, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత విధానం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు పప్పల తిరుమలరావు, జి.శ్రీనివాసరావు, పి.హరిప్రసన్న, బి.నవీన్‌కుమా ర్, వై.ఉమాశంకర్, ఎస్.రమేష్‌బాబు, రవికుమార్, శ్యాంకుమార్, బి.రమేష్ పాల్గొన్నారు.


