ఎస్‌ఎఫ్‌ఐ నిరసన దీక్ష | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎఫ్‌ఐ నిరసన దీక్ష

Jul 10 2026 7:40 AM | Updated on Jul 10 2026 7:40 AM

ఎస్‌ఎఫ్‌ఐ నిరసన దీక్ష

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్‌ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రతినిధులు నిరాహార దీక్ష చేపట్టారు. రిటైర్డ్‌ డిప్యూ టీ డీఈవో కొత్తకోట అప్పారావు, సీఐటీయూ ప్రధా న కార్యదర్శి పి.తేజేశ్వరరావులు శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు, కార్యదర్శి పి.ఖగేష్‌ మాట్లాడుతూ నీట్‌ పేపర్‌ లీక్‌, సీబీఎస్‌ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాక్రోచ్‌ జన తా పార్టీ 19 రోజులుగా, సోనమ్‌ వాంగుక్‌, విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 11 రోజులు పూర్త య్యిందన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వంద లాది మంది విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నా రని చెప్పారు. వారికి మద్దతుగా శ్రీకాకుళంలోనూ దీక్ష చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement