నేటికీ అందని గతేడాది వరద
నష్ట పరిహారాలు
ఎదురుచూస్తున్న అన్నదాతలు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
వెన్నుపోటు పొడిచింది
పరిహారాలు చెల్లించలేదు
కొత్తూరు:
గతేడాది ఖరీఫ్ సీజన్‌లో అక్టోబర్ 3వ తేదీన వంశధార నదికి వచ్చిన వరదలు కారణంగా పంట లు నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్రస్థాయిలో దగా చేసిందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లలో ఎన్నడూ రానంతటి వరద గతేడాది వచ్చింది. ఈ వరదలు వలన కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరు బుజ్జిలితో పాటు పలు మండలాల్లో సుమారు 35 వేలు ఎకరాల్లో వరి, చెరుకు, అరటి, మొక్కజొన్నతో పాటు పలు రకాల పంటలు నీటి మునిగిపోయా యి. అయితే నష్టపోయిన పంటలకు కూటమి ప్రభుత్వం నష్ట పరిహారాలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో వ్యవసాయ అధికారులు వరదలకు నష్టపోయిన పంటలను గుర్తించి, నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. కానీ పంటలు నష్టపోయి తొ మ్మిది నెలలు దాటుతున్నా ఇంతవరకు ప్రభుత్వం పంట నష్ట పరిహారాలు చెల్లించలేదు. 2026 ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ పరిహారాలు చెల్లించకపోవడంతో కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పొడిచిందని పలువురు వాపోతున్నారు.
ఎన్నికల సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పిన కూట మి నాయకులు, అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడిచారు. వంశధార వరదలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడం దారుణం. ఇప్పటికై నా పరిహారాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలి. – సిరిపురం హరీష్,
ఆర్‌కేపురం, కొత్తూరు మండలం
వరదలకు నష్టపోయిన పంటలకు నష్ట పరిహారాలు చెల్లింపులో కూటమి ప్రభు త్వం రైతులను మోసం చేసింది. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే నేటకి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు.
– అగతమూడి రంజిత్,
కుంటిభద్ర, కొత్తూరు మండలం


