ఐడీఎస్‌పీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఐడీఎస్‌పీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Jul 10 2026 7:40 AM | Updated on Jul 10 2026 7:40 AM

ఐడీఎస్‌పీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం బాక్సింగ్‌ కోచ్‌ శిక్షణకు గేయామృత దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: వైద్య ఆరోగ్య శాఖలో ఐడీఎస్‌పీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డేటా మేనేజర్‌– 1, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ – 1, లేబొరేటరీస్‌– 1 పోస్టు లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. srikakulam.nic.inలో నోటిఫికేషన్‌ అందుబాటులో ఉందని వివరించారు. దరఖాస్తుల ను ఐడీఎస్పీ విభాగం, 3వ అంతస్తు, జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం, శ్రీకాకుళంలో జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని కోరారు.

టెక్కలి రూరల్‌: బన్నువాడ గ్రామానికి చెందిన బొడ్డ గేయామృత మహిళా బాక్సింగ్‌ కోచ్‌ శిక్షణకు ఎంపికై నట్లు శిక్షకుడు నర్శిపురం శేఖర్‌ గురువారం తెలిపారు. ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రానికి చెందిన ఈ విద్యార్థిని ప్రస్తుతం బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది. స్పోర్ట్స్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేయగా అందులో గేయామృత ఒకరు. వీరిని ఉత్తమ సర్టిఫైడ్‌ కోచ్‌లుగా తీర్చిదిద్దుతారు. ఈ నెల 13 నుంచి పంజాబ్‌ రాష్ట్రం పటియాలాలో జరగబోయే శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారని శేఖర్‌ తెలిపా రు. గేయామృత శిక్షణకు కావాల్సిన సామగ్రిని జిల్లా క్రీడా అధికారి మహేష్‌బాబు అందించారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : సమాజంలో దివ్యాంగులైన పిల్లలకు సమాన గుర్తింపు, సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. నగరంలోని ఏపీహెచ్‌ బీ కాలనీలో బెహరా మనోవికాస కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. చిన్నారు ల ప్రతిభ, వారు నేర్చుకుంటున్న విద్య, శిక్షణ, వినోద కార్యక్రమాలను పర్యవేక్షించారు. థెర పీ, కౌన్సెలింగ్‌ సేవలను అడిగి తెలుసుకున్నా రు. శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి చిన్నారులు ముందడుగు వేసేలా సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో వికాస కేంద్ర ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

అడ్డగుట్ట : ఈ నెల 7న శబరి ఎక్స్‌ప్రెస్‌లో భార్య కళ్ల ముందే భర్త, మరో మహిళ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మహిళ(36) గురువారం మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. భర్త పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement