కొత్తూరు: కొత్తూరు రాజవీధికి చెందిన లోతుగెడ్డ ధనుంజయ్ ఇంట్లో ఈ నెల మూడో తేదీ రాత్రి జరిగిన దోపిడీ కేసులో నిందితులను గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపారు. వీరిలో కొత్తూరుకు చెందిన సొంట్యాన నవీన్(దాస్), టొంపల వినయ్‌కుమార్, సిరువాడ గ్రామానికి చెందిన కొన్న తరుణ్, ఎల్‌ఎన్‌పేట మండలం గొట్టిపల్లి గ్రామానికి చెందిన కురమాన శ్రీనివాసరావులకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారని చెప్పారు. నలుగురు నిందితులను జిల్లా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.
సంతబొమ్మాళి: జీవనోపాధి కోసం జిల్లాకు వచ్చిన వలస కూలీ సంతబొమ్మాళిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమారియా జిల్లా దడకా గ్రామానికి చెందిన పుష్పరాజ్ సింగ్, ధర్మపాల్ సింగ్‌లు ఆరు నెలల క్రితం భద్రాచలం నాగేశ్వరరావుకు చెందిన రంగనాథ బోర్ వెల్స్‌లో దినసరి కూలీలుగా చేరారు. దీనిలో భాగంగా బుధవారం రాత్రి సంతబొమ్మాళిలో బోరు వేసేందుకు వచ్చారు. భోజనాలు చేసి బహిర్భూమికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వేగంగా వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న పుష్పరాజ్‌సింగ్ మృతి చెందగా..వెనుక ఉన్న ధర్మపాల్‌సింగ్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం గమనించిన స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి ఎస్సై వై.సింహాచలం గురువారం తెలిపారు.
ఎచ్చెర్ల : సనపలవాని పేట సమీపంలో జాతీ య రహదారిపై గురువా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండ లం మురపాక పంచా యతీ నాజానపేట గ్రామానికి చెందిన జగ్గురోతు రామారావు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈయన తన భార్యతో కలిసి ఉదయం ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరి పండిపేట వద్ద భార్యను దించాడు. డ్యూటీ నిమిత్తం సనపలవానిపేట వచ్చి తిరిగి వెళ్తుండగా చిలకపా లెం నుంచి రాగోలు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనకోనడంతో ఈ ప్రమాదం సంభవించింది. రామారావుకు భార్య వరలక్ష్మీ, ఇద్దరు కుమారులు గిరిధర్, వెంకటేష్ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


