మహారాణిపేట (విశాఖ): నగరంలోని ఆశీలమెట్టలో ఉన్న వైశ్యరాజు జ్యూయలర్స్ షోరూమ్ 8వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ వైశ్యరాజు ఫాల్గుణ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు, ప్రతినిధులు వైశ్యరాజు నరేష్ రాజు, వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. వినియోగదారుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం వల్లే సంస్థ ఎనిమిదేళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుందన్నారు. వార్షికోత్సవం పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. అన్ని రకాల 22 క్యారెట్ (916) హాల్‌మార్క్ బంగారు ఆభరణాలపై కేవలం 3 శాతం నుంచి 6 శాతం వరకు మాత్రమే మేకింగ్ చార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు. అలాగే కిలో లేదా అంతకంటే ఎక్కువ వెండి వస్తువులు కొనుగోలు చేసే వారికి రూ.15,000 వరకు ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్లు జులై 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది.


