● డీఆర్‌వలసలో బెల్టుషాపులు నిషేధిస్తూ తీర్మానం
● గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ.25వేల జరిమానా
జి.సిగడాం:
మండలంలోని డీఆర్ వలస ఆదర్శంగా నిలిచింది. ఊరి ఆయువు తీస్తున్న మద్యం బెల్టుషాపులపై కదం తొక్కింది. ప్రభుత్వ షాపుల ద్వారా గ్రామంలోకి మద్యం తీసుకువచ్చి విచ్చలవిడిగా విక్రయిస్తుండడంపై మండిపడింది. ఈ ఊరిలో రెండు బెల్టు దుకాణాలు ఉన్నా యి. ఇకపై ఊరిలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.25వేల జరిమానా విధించాలని గ్రామంలోని రామమందిరం వద్ద స్థానికులు సోమ వారం తీర్మానం చేశారు. ఆ సమాచారం అందించిన వారికి రూ.3వేలు బహుమతిగా ఇస్తామన్నారు. గ్రామంలో ఎవరూ మద్యం అమ్మకుండా ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు యువత ప్రత్యేకంగా నిఘా వేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో కల్తీ మద్యం సేవించి పలువురు మృత్యువాత పడ్డారు. ఇకపై అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా స్థానికులంతా ముందడుగు వేశారు.


