● నష్టపోతున్న పేదింటి విద్యార్థులు
● సక్రమంగా
అమలు కానీ విద్యాహక్కు చట్టం
● ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు తూట్లు
హిరమండలం: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే లక్ష్యంతో ఉచిత విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రైవే టు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు దక్కాలి. కానీ అనేక నిబంధనలు, యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి కారణంగా అర్హులైన పేద విద్యార్థులకు ప్రవేశాలు అందని ద్రాక్షగా మారాయి. జిల్లాలో ఈ ఏడాది కేవలం 1000 లోపు విద్యార్థులు మాత్రమే విద్యాహక్కు చట్టాన్ని ఉపయోగించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏటా ఒకటో తరగతిలో జిల్లాలో 25 వేల మంది విద్యార్థులు కొత్తగా చేరుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం లెక్కన సుమారు ఆరు వేల మందికిపైగా విద్యార్థులను చేర్చుకోవాలి. స్టేట్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్ సిలబస్‌లు అయినా కూడా ప్రవేశం కల్పించాలన్న నిబంధన ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు.
అమలులో నిర్లక్ష్యం
ఈ ఏడాది వేసవిలోనే ఉచిత విద్యకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అమలు విషయంలో మాత్రం పెద్దగా శ్రద్ధ చూపలేదన్న విమర్శ ఉంది. ప్రైవేటు బడుల్లో విధిగా 25 శాతం సీట్లు కేటాయించాలి. ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. దుస్తులు, పుస్తకాలు, ఇతర ఖర్చులు మాత్రమే విద్యార్థులు భరించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకుంటే..రిజర్వేషన్ల ప్రాప్తికి అమలు చేస్తారు. లాటరీ తీసి అడ్మిషన్లు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. అయితే పాఠశాలల్లో చేరిన వెనుకబడిన వర్గాలకు చెందినవారినే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పేద విద్యార్థులుగా చూపుతున్నారు. వారికి ఈ పథకం కింద అడ్మిషన్లు ఇచ్చామని చెప్పి.. వారి దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు. అందువలన ఇప్పటికై నా అధికారులతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచిత ప్రవేశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు 402 వరకు ఉన్నాయి. సుమారు 1,10,692 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కానీ ఈ ఏడాది ఉచిత సీట్లు కేటాయించిన పాఠశశాలలు కేవలం 256 మాత్రమే. అవి కూడా 25 శాతం కాదు. అరకొరగానే మాత్రమే సీట్లు కేటాయించి చేతులు దులుపుకున్నాయి ఎక్కువ పాఠశాలలు. జిల్లాలో ఆరువేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించాల్సి ఉంటే.. అందులో కేవలం 1000 మంది వరకు విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందడం ఆందోళన కలిగిస్తోంది. వారికి సైతం రకరకాల రూపంలో ఫీజుల మోత తప్పదంటున్నారు తల్లిదండ్రులు. చాలావరకూ పాఠశాలలు సాధారణ అడ్మిషన్లనే పేద విద్యార్థులుగా చూపి ఈ పథకాన్ని నీరుగార్చుతున్నాయన్న విమర్శలూ ఉన్నాయి.
పట్టించుకోని
అధికారులు


