మండలంలోని మీ సేవ, గ్రామ సచివాలయాల్లో స్టేషనరీ కొరత వేధిస్తోంది. ముఖ్యంగా 1బీ, అడంగల్, కుల, ఆదాయ, ఓబీసీ తదితర ధ్రువీకరణ పత్రాల కోసం వినియోగించే ప్రింటెడ్ స్టేషనరీ సరఫరా నిలిచి పోయింది. దీంతో రైతులు పంట రుణాలు రెన్యువల్ చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకర్లు ప్రింటెడ్ స్టేనరీపై 1బీ కావాలంటూ కోరడంతో చేసేంది లేక, సమయానికి పంట రుణాలు రెన్యువల్ చేయలేక అదనపు వడ్డీ కడుతున్నారు. విద్యార్థులు సైతం ధ్రువీకరణ పత్రాలు అందుకోలేకపోతున్నారు. పలాస, కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కాగితాలు ఇవ్వలేని సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.
–వజ్రపుకొత్తూరు


