రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి

Jul 6 2026 1:46 AM | Updated on Jul 6 2026 1:46 AM

జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ

కవిటి: రాజకీయాల్లో అధికార, విపక్షాలు పరస్పరం విమర్శించుకోవడం సహజమే అయినా నైతిక విలువలు పాటించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. మండలంలోని చండిపురంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అధికార పక్ష నేతలు సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్న వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా వైఎస్సార్‌సీపీ తరపున ఖండిస్తున్నామన్నారు. వ్యవస్థాగత విమర్శల స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు. అధికార కూటమి నాయకులు హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. ఆమెతో పాటు నేతలు బొర్ర వెంకటరమణ, ఎన్ని అశోక్‌, వజ్జ ప్రసాదరావు, నరసింహమూర్తి, సంతోష్‌, రవి తదితరులు

తమ్మినేనిపై పోస్టులు తీవ్రంగా ఖండిస్తున్నాం

ఇచ్ఛాపురం: మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని టీడీపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కష్టాలను చూసి భావోద్వేగానికి గురైన అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం దిగజారుడుతనానికి నిదర్శనంగా వివరించారు. ఉత్తరాంధ్ర బీసీ నాయకుడిగా.. స్పీకర్‌గా శాసనసభ గౌరవాన్ని పెంచిన ఏకై క నాయకుడు తమ్మినేని సీతారాం అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వ్యక్తి తమ్మినేని అని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు నర్తు ప్రేమ్‌కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఆశి కృష్ణారెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి సల్లా దేవరాజు, ఆశి పురుషోత్తం, కారింగి త్రినాథ్‌, బర్ల నాగభూషణం, నీలాపు జగదీష్‌, శ్రీరామ్‌రెడ్డి, సాడి జయరామ్‌ రెడ్డి, రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement