శ్రీకాకుళం రూరల్: నిషేధిత ల్యాండ్ సీలింగ్ భూములుగా ప్రభుత్వం వారిచే గుర్తించిన రాగోలు గ్రామ సర్వే నంబర్ 156/1, 156/2, 156/3, 156/4, 156/5లో మొత్తం 23.27 ఎకరాల భూమిని కోర్టు కేసులు నడుస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క ఉడా అనుమతులు తెచ్చుకొని అక్రమార్కులు అమ్ముకున్నారు. దీనిపై బాధితులు పైడి సూరిబాబు, పైడి గోవిందరావు, డోల పద్మాకర్, సత్తారు కూర్మారావు, బొంగు రఘ, నంబారు రంగారావు, పి.మణి తదితరులు స్థానిక వెంచర్ వద్ద ఆదివారం ధర్నా చేపట్టారు. విజయనగరానికి చెందిన దుర్గా ఉమాదేవి, ఆమె భర్త బాలాజీలు ఈ భూమిలో మధ్య తరగతి కుటుంబాలను మభ్యపెట్టి సుమారు రూ.14 కోట్లు దండుకొని అమ్మకాలు చేశారని, ఇప్పుడు వారంతా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.


