● త్రుటిలో తప్పిన ప్రమాదం
టెక్కలి రూరల్: టెక్కలి నౌపడ రోడ్డులో స్థానిక మేదర వీధి జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోరుభద్ర నుంచి టెక్కలి వస్తుండగా మేదర వీధి జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ బస్సును గుర్తించి కారును రోడ్డుపై ఆపేశాడు. బస్సు డ్రైవర్ బస్సు వేగాన్ని అదుపు చేయలేక ఆగి ఉన్న కారుని బలంగా ఢీకొన్నాడు. ఆ కారు ఒక్కసారిగా వెనక్కి వెళ్లి మరో కారును ఢీకొట్టింది. ఆ కారు మరో కారును ఢీకొంది. మొత్తం మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. కారులో ఎవరికీ ఎలాంటి గాయా లు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సుతో పాటు మూడు కార్లు మరమ్మతులకు గురయ్యాయి. ప్రమాదంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్‌ఐ రాము కార్లను రోడ్డు పక్కకు మళ్లించి ట్రాఫిక్ క్లీయర్ చేశారు. అనంతరం స్థానికుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు.


