సోంపేట: పైడిగాం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి ఖరీఫ్‌కు సాగునీరు అందించాలని ఎంజేఆర్ పూలే రాష్ట్ర బీసీ సంఘం ప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. పైడిగాం ప్రాజెక్టును ఆదివారం ఆ సంఘ నాయకులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధికారులు, ప్రభుత్వం రూ.45 కోట్ల అంచనాతో పూర్తి స్థాయి మరమ్మతులు చేపడతామని చెప్పి ఏడాది గడు స్తు న్నా పనులు జరగలేదన్నారు. కనీసం కోటి రూపాయల నిధులు వెచ్చించి థర్డ్ యాప్రాన్ మరమ్మతులు, చీకటి గెడ్డ పైపూన్ మరమ్మతులు, 9/4 పైపూన్ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకుంటే ప్రాజెక్టు ఆయకట్టు ఎడారిగా మారిపోతుందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు.


