నిర్లక్ష్యం కొనసాగుతోంది..! | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం కొనసాగుతోంది..!

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

నిర్లక్ష్యం కొనసాగుతోంది..! ● రైతులకు కలగా మిగిలిపోయిన ఉపాధి అనుసంధానం ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● 2014 నుంచి హామీ ఇస్తున్న టీడీపీ ఉపాధి, సాగు వివరాలివీ.. అప్పుల పాలవుతున్నాం...

ఉపాధికి అనుసంధానం అవసరం..

కూలీల కొరత ఇలా..

● రైతులకు కలగా మిగిలిపోయిన ఉపాధి అనుసంధానం ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● 2014 నుంచి హామీ ఇస్తున్న టీడీపీ

కంచిలి:

పాఽధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఎప్పుడో 2014 నుంచి టీడీపీ దీనిపై హామీలు ఇస్తోంది. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి గానీ దీన్ని అమలు చేసిన పాపాన పోలేదు. వేతనదారులు ఎక్కువగా ఉపాధి హామీ పనులకు వెళ్తుండటంతో వ్యవసాయ పనులకు కొరత ఏర్పడుతోంది. దీంతో కూలి రేటు పెరగడంతోపాటు వ్యవసాయ పనులు సకాలంలో పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యంత్ర పరికరాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా చాలా పనులు కూలీల ద్వారానే చేయించాల్సి ఉంటుంది. దీంతో కూలీల కొరత ఏర్పడి రైతులు అగచాట్లు పడుతున్నారు. అందువలన రైతన్నలు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ అనుసంధానం చేస్తే బాగుంటుందని రైతులపై ఖర్చులు భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

2014 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అను సంధానం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించింది. ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి టీడీపీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు వారిచ్చిన హామీని అమలు పరిచేందుకు ఉపక్రమించడం లేదని వ్యవసాయదారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఎంపీలు అవసరమైనంత ఎక్కువ మంది ఉన్నప్పటికీ, గతంలో ఇచ్చిన హామీ అయిన ఉపాఽధి హామీ పథకానికి వ్యవసాయానికి అనుసంధానించాలనే ఆలోచన చేయడం లేదని రైతులు వాపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఉపాఽధి హామీ పథకంలో 1,81,101 జాబ్‌కార్డులు నమోదయ్యాయి. సుమా రు 40 లక్షల పనిదినాలు లక్ష్యంగా పనులు చేపట్ట డం జరిగింది. ఈ పథకం ద్వారా ఎస్సీ వర్గాలకు 28.66 శాతం, ఎస్టీ వర్గాలకు 0.87 శాతం, మహిళలకు 55.45 శాతం పని దినాలు కల్పించారు. ఇక జిల్లాలో 3,56,654 హెక్టార్ల భూమిని సాగుచేస్తున్నా రు. ఇందులో ప్రధాన పంటల్లో వరి 7.78 లక్షలు ఎకరాలు, మొక్కజొన్న 4.49 లక్షల ఎకరాలు, కంది 3.43 లక్షల ఎకరాలు, ఉద్యాన పంటలు 1.10 లక్షల ఎకరాలు సాగుచేస్తున్నారు.

రైతులకు పంటల సాగు భారంగా మారింది. వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడులు కూడా దక్కడం లేదు. పెట్టిన ఖర్చు రాకపోగా అప్పుల పాలవుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల కష్టాలను గుర్తించి, ఉపాఽధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. అప్పుడే కొంత ఖర్చు భారం రైతులపైన తగ్గుతుంది. – లడ్డుకేశవ పాత్రో, రైతు,

డోలగోవిందపురం గ్రామం, కంచిలి మండలం

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో పంటసాగు రైతులకు భారంగా మారింది. ప్రతి పంటకు రైతులు అప్పులు చేసి సాగు చేస్తున్నప్పటికీ లాభాలు మాత్రం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. లేదంటే రైతులు వీధులపాలైపోతారు.

– యారడి ఆనందరావు, రైతు, మాజీ సర్పంచ్‌, గోకర్ణపురం గ్రామం, కంచిలి మండలం

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌, రబీ కాలంలో సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వరి పంటను, తర్వాత కమర్షియల్‌ క్రాప్స్‌ వేరుశనగ, చెరుకు, తడులు తక్కువగా ఉన్న సమాయాల్లో అపరాలను సాగుచేస్తున్నారు. రైతులు వారి స్థోమతకు మించి పెట్టుబడులు పెడుతూ వ్యవసాయం చేస్తూ, ఖర్చులు భారమై లబోదిబోమంటున్నారు. నష్టాలపాలవుతున్నారు. వరి, వేరు శనగ రైతులకు ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.35వేలు వరకు ఖర్చవుతుందని అంటున్నారు. వ్యవసాయ రంగాన్ని ఉపాఽధికి అనుసంధానం చేస్తే కూలీల కొరతతోపాటు రైతులపై వ్యవసాయ సాగు ఖర్చు తగ్గుతుందని అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కేంద్రాన్ని ఒత్తిడి చేసి ఉపాఽధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement