శ్రీకాకుళం న్యూకాలనీ: తొమ్మిదో ఆలిండియా నేషనల్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడు భార్గవ్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక పోటీలు ఈనెల 12 నుంచి 19వ తేదీ వరకు అస్సోంలోని గువాహటి వేదికగా జరగనున్నాయి. శ్రీకాకుళం నగరానికి చెందిన ఈ యువ స్టార్ బాక్సర్ ఈ పోటీల కోసం ఇప్పటికే అస్సోం చేరుకున్నాడు. భార్గవ్ ఈ పోటీల్లో 85–90 కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. మెగా టోర్నీకి సిక్కోలు బాక్సర్ ఎంపిక కావడంపై జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంత లక్ష్మణ్‌దేవ్(అను), సీతారామ్, వంగా మహేష్, డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు, కోచ్ ఉమామహేశ్వరరావు, రాజీవ్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.


