సుందరరావును అభినందించిన కృష్ణదాస్
నరసన్నపేట: రావులవలసకు చెందిన పైల సుందరరావును మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అభినందించారు. సుందరరావు గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికై న విషయం విదితమే. డీఎస్పీగా ఎంపికై న సుందరరావు మర్యాద పూర్వకంగా సోమవా రం ధర్మాన కృష్ణదాస్‌ను మబగాంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కృష్ణదాస్ శాలువ తో సత్కరించారు. నిరుపేద కుటుంబం నుంచి గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి ఉన్నత కొలువు సాధించడం గొప్ప విషయమని కృష్ణదాస్ అన్నారు. అలాగే సుందరరావు తండ్రి పైల రాజారావును అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మడ్డు కృష్ణ, పంచిరెడ్డి సత్యం, పంచిరెడ్డి శివ, పల్లి వెంకటేష్, ముద్దాడ గోపి, మడ్డు అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
23 వరకు స్మార్ట్ మీటర్స్ పఖ్వాడా
అరసవల్లి: విద్యుత్ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక సేవలు, ప్రీపెయి డ్ మీటర్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యా ప్తంగా ‘స్మార్ట్ మీటర్స్ పఖ్వాడా’ పేరిట ఈనెల 9 నుంచి 23 వరకు పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం ఎంతమేర అవుతుందో అనే సమాచారం కూడా మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ఈ పక్షోత్సవాల్లో విద్యుత్ వినియోగదారుల కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, మొబైల్ యాప్ ఇన్‌స్టాలేషన్ కేంద్రాలు, మీటర్ల పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లుగా ఆయన వివరించారు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ 1912ను కూడా సంప్రదించవచ్చునన్నారు.
11న వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సమావేశం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఉత్తరాంధ్ర వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం ఎండాడ లా–కాలేజ్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో యువజన విభాగం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో యువజన విభాగం కార్యకలాపాల సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి యువజన విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం, మండలం డివిజన్ స్థాయి అధ్యక్షులంతా హాజరవ్వాలని కోరారు.
సుందరరావును అభినందించిన కృష్ణదాస్
సుందరరావును అభినందించిన కృష్ణదాస్


