కింజరాపు కుటుంబంతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

కింజరాపు కుటుంబంతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

కింజరాపు కుటుంబంతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు

కింజరాపు కుటుంబంతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు

చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమైనా

తీసుకువచ్చారా?

ఆమదాలవలస వైఎస్సార్‌ సీపీ

సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ ధ్వజం

ఆమదాలవలస: సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కింజరాపు కుటుంబంతో జిల్లాకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ విమర్శించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు జిల్లాకు చేసిన సేవలు శూన్యమన్నారు. ఇప్పటికై నా జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయించి రుణం తీర్చుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రికి రాసిన లేఖను ఆదివారం విడుదల చేశారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 13 జిల్లాలు కలిగిన రాష్ట్రానికి 23 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, మన జిల్లాకు ఒక్క సంస్థ కూడా రాకపోవడం మీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. మూలపేట పోర్టును పక్కనపెట్టి రామాయపట్నం వద్ద బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయడం చేతకానితనాన్ని చాటుతోందన్నారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు పలు ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిని జిల్లాకు తీసుకొచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. వంశధార ప్రాజెక్టు సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. గతంలో ఏపీ సీఎంగా పనిచేసినప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరడి బ్యారేజ్‌ విషయమై ఒడిశా సీఎంతో చర్చించారని గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌, బూర్జ, సరుబుజ్జిలి మండల పార్టీ, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, బెవర మల్లేశ్వరరావు, పొడుగు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, ముఖ్యనాయకులు దుంపల శ్యామలరావు, మామిడి రమేష్‌, ఈశ్వరరావు, బొడ్డేపల్లి నాగరాజు, ఎస్‌.తవిటినాయుడు, మన్మధరావు, దన్నాన అజయ్‌కుమార్‌, చిగురుపల్లి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement