●సాంకేతిక పరిజ్ఞాన ‘ప్రవాహ్’ం
భువనేశ్వర్: క్రానికల్స్ ఆఫ్ టైమ్ ఇతివృత్తంతో భువనేశ్వర్‌లోని భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) సంయుక్త సాంస్కృతిక, టెక్నోప్రెన్యూర్ షిప్ వార్షిక ఉత్సవం ప్రవాహ్ ఉత్సాహంగా సాగింది. నాలుగు రోజుల పాటు జరిగిన ప్రవాహ్ కార్యక్రమం సాంకేతికత, సంస్కృతి, వ్యవస్థాపకత సంగమాన్ని ప్రతిబింబించింది.
డేటా సైన్స్ హ్యాకథాన్, జనరల్ క్విజ్, మార్కటస్ బిజినెస్ ఛాలెంజ్, ఫ్యాషన్ షో, స్టార్టప్ ఎక్స్‌పో, రోబో సాకర్, సాంస్కృతిక ప్రదర్శనలు, స్టార్ నైట్ వంటి విభిన్న కార్యక్రమాల మేళవింపుగా ఆకట్టుకుంది. ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద కర్మల్కర్, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ రోషన్ దాస్, ప్రవాహ్ చైర్‌పర్సన్ డాక్టర్ జి.సంతోష్ కుమార్, స్టూడెంట్ జింఖానా అధ్యక్షుడు డాక్టర్ కోదండ రామ్ మంగిపూడి, ప్రవాహ్ సహ చైర్‌పర్సన్ డాక్టర్ బంకిమ్ చంద్ర మహంత హాజరైన ఈ కార్యక్రమానికి విద్యార్థి కందుల జోజి కుమార్ ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించాడు.


