ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని మంగువారితోటకు చెందిన నానుబాల లలితారా ణి (72) మృతి చెందడంతో ఆమె నేత్రాల ను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కుమారుడు భవానీప్రసాద్, ఎ.వెంకటరమణ, డోలా వలసయ్యలు విషయాన్ని రెడ్‌క్రాస్‌కు తెలియజేయగా సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్ కోరారు.
టెక్కలి: మార్చి నెలాఖరులోగా వివిధ రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో కొత్తగా రెండు ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి , పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖాధికారులు పాల్గొన్నారు.
ఆమె నేత్రాలు సజీవం


